ఈ వేసవిలో ఆ రాశులకు తిరుగే ఉండదు.. ఆదాయం, అధికారం పక్కా..!

Edited By:

Updated on: Mar 28, 2026 | 12:34 PM

Summer 2026 Astrology: ఈసారి వేసవి కాలంలో, అంటే ఏప్రిల్, మే నెలల్లో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. కుజ, బుధ, రవి, శుక్రులు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి వేసవి కాలంలో కొన్ని ఆకస్మిక సానుకూల మార్పులతో పాటు, కొన్ని సంచలనాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశివారి జీవితాల్లో ఆదాయానికి, అధికారానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 6
మేషం: ఈ రాశిలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండబోతున్నందువల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంటా బయటా ఊహించని స్థాయిలో గౌరవమర్యాదలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని  మించుతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తులు సమకూరుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి ఏప్రిల్, మే నెలల్లో లాభ స్థానంలో గ్రహాల సంచారం ఎక్కువగా జరుగుతున్నందువల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో మంచి అధికార యోగం పడుతుంది. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాటపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా జరుగుతున్నందువల్ల జీవితంలో సంచలనాలు, సానుకూల మలుపులు చోటు చేసుకుంటాయి. విదేశీయానాలకు, తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

4 / 6
తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో ప్రధానమైన గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల వేసవి కాలమంతా ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా చెలామణీ కావడం జరుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఉన్నత స్థానాలకు వెళ్లే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

6 / 6
మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుభ గ్రహాల సంచారం పెరుగుతున్నందువల్ల ఈ రాశివారికి విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు ఆర్థికంగా లాభిస్తాయి. సంపన్న కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంటుంది.

Follow Us