
మేషం: ఈ రాశికి ద్వితీయ, సప్తమాధిపతి అయిన శుక్రుడికి స్వస్థానంలో బలం పెరిగినందువల్ల శుభ శోభన యోగాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడంతో పాటు పెళ్లి ప్రయ త్నాలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. శుక్రుడు జనవరి 5న వృశ్చిక రాశిలోకి మారే లోగా వీరికి పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి.

మిథునం: ఈ రాశికి పంచమాధిపతి అయిన శుక్రుడు రాశ్యధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల శుక్ర మూఢమి తర్వాత నుంచి పెళ్లి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉన్న బంధువుతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో కూడా ఊహించని విజయం సాధిస్తారు. ఈ రాశివారికి డిసెంబర్ 15 లోపు పెళ్లయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలున్నా తొలగిపోయే అవకాశం ఉంది. తప్పకుండా సంతాన యోగం పడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు, కుటుంబానికి సంబంధించిన స్థానంలో శుక్రుడికి బలం పెరగడం వల్ల ఈ రాశివారికి డిసెంబర్ లోపల పెళ్లయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. ఆస్తిపాస్తులు, ఉన్నతోద్యోగం కలిగిన వ్యక్తితో పెళ్ళి కుదిరే అవకాశం ఉంది. మూఢమి తొలగిపోయిన తర్వాత చేపట్టే ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. దంపతులకు సంతాన యోగం పడుతుంది.

తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడికి భాగ్య స్థానాధిపతి బుధుడితో యుతి ఏర్పడినందువల్ల ఈ రాశివారు ఈ నెల 29 తర్వాత నుంచి పెళ్లి ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. విదే శాల్లో స్థిరపడిన బంధువుతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధించడం, అది పెళ్లికి దారితీయడం జరుగుతుంది. డిసెంబర్ 10 లోపల ఈ రాశివారికి తప్ప కుండా దాంపత్య జీవితం ఏర్పడుతుంది. సంతాన యోగానికి కూడా బాగా అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడు మూఢమి నుంచి బయటపడడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే సూచనలు న్నాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో ఎటు వంటి సమస్యలున్నా సమసిపోయి అన్యోన్యత బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు మూఢమి నుంచి బయటపడడం వల్ల ఈ రాశివారికి విదేశీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుక్రుడితో బుధ, రవుల యుతి వల్ల కార్తీక మాసంలో వీరికి పెళ్లయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి, పెళ్లి పీటలెక్కే అవకాశం ఉంది. సాధారణంగా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది.