
మేష రాశి : శ్రావణ మాసంలో మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం.

మీన రాశి : మీన రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుందంట. ఉద్యోగస్థులకు ఇది చాలా మంచి సమయం. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వీరికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి అవుతాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంటా బయట సానుకూలత వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.

కర్కాటక రాశి :కర్కాటక రాశి వారికి శ్రావణ మాసంలో పట్టింది బంగారమే అవుతుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువగా అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే గత కొంత కాలం నుంచి అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. అనుకున్న సమయానికి అప్పులు మొత్తం పూర్తి అవుతాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు