
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ గురువు, సెప్టెంబర్ 2 నుంచి తులా రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఈ శ్రావణంలో తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో పెళ్లి కావడానికి అవకాశం ఉంది. శ్రావణ మాసం నుంచి వీరి జీవి తంలో కొత్త దశ ప్రారంభం అవుతుంది. ప్రేమలు, పెళ్లిళ్లు అంచనాలకు మించి సక్సెస్ అవుతాయి. అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.

మిథునం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల శ్రావణ మాసంలో వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ ప్రవేశం చేసే సూచనలున్నాయి. ప్రేమ వ్యవ హారాలు విజయవంతం అవుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగి హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం: ఈ రాశిలో అత్యంత శుభ గ్రహమైన గురువు, తృతీయ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి శ్రావణ మాసం అనేక శుభ యోగాలను తీసుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలు తప్ప కుండా పెళ్లికి దారి తీస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది. గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చేపట్టే ప్రయత్నాలు సానుకూల ఫలితాలని స్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కనక వర్షం కురిపిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.

వృశ్చికం: శ్రావణ మాసమంతా ఈ రాశికి భాగ్య, లాభ స్థానాల్లో గురు, శుక్రుల సంచారం వల్ల కొద్ది ప్రయ త్నంతో ఈ రాశివారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. శ్రావణ మాసంలో పెళ్లి జరగడానికి బాగా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి కుటుం బంతో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వివాహ యోగంతో పాటు ధన యోగాలు కూడా కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అను కూలంగా ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో సెప్టెంబర్ మొదటి వారంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి. దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమై ఆనందోత్సాహాలు బాగా వృద్ధి చెందుతాయి.

మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి, సప్తమ స్థానంలో శుక్రుడి అనుకూలత వల్ల తప్పకుండా పెళ్లి బాజాలు మోగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది. ముఖ్యంగా తాను కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేపట్టడానికి కూడా ఈ శ్రావణ మాసం బాగా అనుకూలంగా ఉంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.