Jupiter Blessings: తొలగిన శని దోషం.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!

Edited By:

Updated on: Jun 22, 2026 | 7:33 PM

Lord Shani Dev: ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల కొన్ని రాశుల వారికి శనిదోషం కలిగి, కష్టనష్టాలు చుట్టుముట్టడం జరుగుతోంది. అయితే, కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండి, శుభ గ్రహాలైన శుక్ర, బుధులతో యుతి చెందిన గురువు ఈ శనిని నవమ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల ఈ రాశుల వారికి శని దోషం ఇక చాలావరకు తొలగిపోతుంది. ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని వంటి దోషాల గురించి ఈ రాశుల వారు అక్టోబర్ 31 వరకు మరచి పోవడం మంచిది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఈ నెలాఖరు నుంచి మళ్లీ అదృష్టాలు పట్టడం మొదలవుతుంది.

1 / 6
మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉండి ఏలిన్నాటి శని దోషం కలిగిస్తున్న శని శుభ గ్రహాల వీక్షణతో శుభుడుగా మారినందువల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ నెలాఖరు నంచి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అధికార యోగం పట్ట డం, ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, సంతాన ప్రాప్తి కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు.

2 / 6
సింహం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల కలిగిన అష్టమ శని దోషం దాదాపు పూర్తిగా తొలగిపోయింది. వ్యయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో, శుభ గ్రహాలతో కలిసి ఉన్న గురువువల్ల ఈ రాశివారికి పని భారం, వృథా ఖర్చులు, అనవసర పరిచయాలు, అనారోగ్యాల నుంచి క్రమంగా విముక్తి కలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లి సంపాదించే అవకాశం కలుగుతుంది.

3 / 6
కన్య: లాభ స్థానంలో శుభ గ్రహాలతో కలిసి ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు వీక్షించడం వల్ల శని బలం బాగా తగ్గింది. ఈ రాశికి ఏడవ స్థానంలో ఉన్న శని వల్ల ఈ రాశివారికి ఇక నుంచి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల కలిగిన అర్ధాష్టమ శని దోషం ఇక నుంచి ఈ రాశివారికి ఎటువంటి సమస్యలూ కలిగించకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆగిపోయిన శుభ కార్యాలు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆస్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.

5 / 6
కుంభం: ఉచ్ఛ స్థితిలో శుభ గ్రహాలతో కలిసి ఉన్న గురు దృష్టితో ఈ రాశివారికి ఏలిన్నాటి దోషం పూర్తిగా తొలగిపోయి, ధన యోగాలు పట్టడం ప్రారంభం అవుతుంది. ప్రతి ప్రయత్నమూ పూర్తి స్థాయిలో సఫలం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయ వృద్ధికి, పదోన్నతులకు, ధన లాభాలకు, ఆరోగ్యానికి బాగా అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి వారం నుంచి వీరి దశ తిరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

6 / 6
మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టి ఈ రాశిలో ఉన్న శనిని వీక్షించడం వల్ల ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది. శనీశ్వరుడు యోగదాయకుడుగా మారి ఈ రాశివారికి ధన యోగాలు, రాజయోగాలు కలిగించడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సంపన్నుడి స్థాయికి ఎదుగుతారు. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

Follow Us