Lord Shani Dev: శని వక్ర సంచారం.. ఇవాళ్టి నుంచి ఆ రాశుల వారికి లాభమే లాభం!

Edited By:

Updated on: Jul 27, 2026 | 11:53 AM

జూలై 27 నుంచి డిసెంబర్ 12 వరకు మీన రాశిలో శని వక్రగతి చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఈ నాలుగున్నర నెలల కాలంలో నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో వేగం పెరగడం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉండనుంది.

1 / 7
జూలై 27 (సోమవారం) నుంచి డిసెంబర్ 12 వరకు శనీశ్వరుడు మీన రాశిలో వక్రించడం జరుగుతోంది. మందగతితో సంచరించే శనీశ్వరుడిలో ఈ వక్రగతి వల్ల చురుకుదనం, వేగం పెరుగుతుంది. సుమారు నాలుగున్నర నెలల పాటు శని వక్రించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.. ఇంతవరకూ పూర్తి కాని పనులు పూర్తవుతాయి. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ వేగం పుంజుకుంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. శనీశ్వరుడు వక్రించిన ఈ నాలుగున్నర  నెలల కాలం ఈ రాశులకు అదృష్టవంతమైన  కాలంగా చెప్పవచ్చు.

2 / 7
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక విదేశీయాన అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో కార్యక లాపాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది..

3 / 7
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలోనే కాక, కుటుంబంలో కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరు ద్యోగులకు  విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందే అవకాశం ఉంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

4 / 7
కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. విదేశాలకు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవసరం కలుగుతుంది. తండ్రి ఆస్తికి సంబంధించిన వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు.

5 / 7
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శని వక్రగతి పట్టడం వల్ల ఈ రాశివారి రాజకీయ ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారికి అధి కార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు  ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

6 / 7
వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శని వక్రగతి పట్టడం వల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవ కాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. నైపుణ్యాలు అభి వృద్ధి చెందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి.

7 / 7
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని వక్రించడం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధికి, కొత్త ఉద్యోగానికి, ఆస్తి వివా దాల పరిష్కారానికి, విదేశీ అవకాశాలకు ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

Follow Us