Lord Shani: శనీశ్వరుడికి పరిహారాలు..వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి..!

Edited By:

Updated on: Jan 29, 2026 | 6:55 PM

Lord Shani Dev: వచ్చే ఏడాది(2027) జూలై వరకు మీన రాశిలో సంచారం చేస్తున్న శని వల్ల కొన్ని రాశుల వారు కష్టనష్టాలు అనుభవించే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు కలగడం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం కాకపోవడం, అత్యవసర పనులు ఆగిపోవడం, మోసపోవడం ధన లాభాలకు గండిపడడం, పదోన్నతులకు ఆటంకాలు ఏర్పడడం, కుటుంబంలో చిక్కులు తలె త్తడం వంటివి జరుగుతాయి. శనికి పరిహారాలు పాటించడం వల్ల వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మిగిలిన రాశుల వారికి శని దోషాలు గానీ, సమస్యలు గానీ ఉండే అవకాశం లేదు.

1 / 6
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీని వల్ల పదోన్నతులు ఆగిపోవడం, ఆదాయం వృద్ధి చెందకపోవడం, జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడం వంటివి తప్పకుండా జరుగుతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలకు ఎక్కువ అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివార్చన వల్ల, శనికి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీటి నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది.

2 / 6
సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ఈ రాశివారికి అనారోగ్యాలు, అవమానాలు, నిరాశా నిస్పృహలు, వైఫల్యాలు, అపజయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. అష్టమ శని ఆయుర్దాయానికి కూడా మంచిది కాదు. శివార్చనతో పాటు శని స్తోత్రం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి పనిభారం, పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సప్తమ శని దాంపత్య జీవితానికి, కుటుంబ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. ఉద్యోగాల్లో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలన్న పక్షంలో శివార్చనతో పాటు శని మంత్ర జపం చేయడం మంచిది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మనశ్శాంతి కొరవడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఏదో ఒక అనారోగ్యం లేదా సమస్య ఇబ్బంది పెడుతుంది. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఆటంకాలు, సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా చికాకులుంటాయి. తిలలు, మినుములు దానం చేయడం వల్ల ఈ శని దోషం తగ్గుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. ధన నష్టంతో పాటు, కుటుంబ సమస్యలు పేట్రేగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగంలో మాటకు విలువ తగ్గుతుంది. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. రావలసిన సొమ్ము రాకపోవచ్చు. ఆర్థికంగా మోసపోవడం జరుగుతుంది. శివార్చనతో పాటు శనికి జపం చేయించడం వల్ల ఈ పరిస్థితులు తారుమారవుతాయి.

6 / 6
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం కలిగింది. ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం తగ్గుతాయి. ఆదాయ వృద్ది ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడక నడుస్తాయి. కష్టార్జితం వృథా అవుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. శనికి దానాలు చేయడంతో పాటు, శని జపం చేయడంమంచిది.