Lucky Zodiac Signs: రెండు శుభ యోగాలు.. వారికి అదృష్టాలు..! ఇందులో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Feb 23, 2026 | 7:02 PM

ఈ నెల (ఫిబ్రవరి) 26, 27, 28 తేదీల్లో మిథున రాశిలో గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుండగా, అదే సమయంలో కుంభ రాశిలో రవి, బుధుల కలయికతో బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతోంది. ఈ రెండు యోగాల వల్ల ఆరు రాశులకు జీవితం సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ రెండు యోగాల ప్రభావం ఆదాయం మీదా, అధికారం మీదా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, కుంభ రాశులవారు ఈ మూడు రోజుల్లో ఎటువంటి కొత్త ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం, లాభ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల  బుధాదిత్య యోగం ఏర్పడడం ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. వీరికి సమీప భవిష్యత్తులో తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి అంచనాలకు మించిలాభాలనిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు  లభిస్తాయి.

2 / 6
మిథునం: ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడడం, రాశ్యధిపతి బుధుడు, రవి భాగ్య స్థానంలో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. జీతభత్యాలు పెరగడం, లాభాలు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రాప్తి యోగం ఉంది.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం, సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.

4 / 6
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం, పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల  అనేక కీలక విషయాల్లో వీరి అదృష్టానికి తిరుగుండదు. ఆర్థికపరంగా వీరికి తప్పకుండా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, షష్ట స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం ఉద్యోగపరంగా ఊహించని అదృష్టాలను కలగజేస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలు, బకాయిలను రాబట్టుకుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో వేతనాలు బాగా పెరుగుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశిలో రవి, బుధులు కలవడం, పంచమ స్థానంలో గురు, చంద్రులు కలవడం వల్ల ఈ రాశి వారికి ఊహించని రాజపూజ్యాలు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో కూడా పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి.

Follow Us