Ramanavami 2022: శ్రీరామనవమి రోజున ఈ ప్రసిద్ధ ఆలయాలను తప్పక సందర్శించండి.. ఎక్కడెక్కడున్నాయంటే..

|

Apr 10, 2022 | 12:29 PM

శ్రీరామనవమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలి.

1 / 5
 దేశంలో రాముడికి అంకితం చేయబడిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.  రామ నవమి ప్రత్యేక రోజూన ఈ ఆలయాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దర్శనం కోసం ఏ ప్రసిద్ధ రాముడి ఆలయానికి వెళ్లవచ్చో తెలుసుకుందాం.

2 / 5
రామ్ రాజా ఆలయం.. మధ్యప్రదేశ్ - రామ్ రాజా ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. ఈ ఆలయంలో, శ్రీరాముడు దేవుడిగా,రాజుగా పూజించబడతాడు. ఈ ఆలయం కోట రూపంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు ఒక గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. ఈ ఆలయంలో ప్రతిరోజూ రాజా రాముడికి సాయుధ వందనం సమర్పించబడుతుంది. ఇది ఈ ఆలయానికి సంబంధించిన సంప్రదాయం  మరింత ప్రత్యేకమైనది.

3 / 5
కాలరామ్ ఆలయం, నాసిక్ - మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో కలారామ్ ఆలయం ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత అందమైన రామాలయాల్లో ఒకటి. ఇందులో 2 అడుగుల ఎత్తైన నల్లని రాముడి విగ్రహం ఉంది. రాముడితో పాటు సీతా, లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి. 14 సంవత్సరాల వనవాసంలో, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు 10వ సంవత్సరం తర్వాత గోదావరి నది ఒడ్డున నివసించడానికి పంచవటికి వచ్చారని నమ్ముతారు.

4 / 5
అయోధ్య రామమందిరం. ఉత్తరప్రదేశ్ - ఈ ఆలయాన్ని శ్రీరాముని జన్మస్థలంగా పిలుస్తారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదికి కుడివైపున ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

5 / 5
రఘునాథ్ ఆలయం, జమ్మూ - ఈ ఆలయం ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం జమ్మూ మధ్యలో ఉంది. రఘునాథ్ ఆలయం రాముడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో భక్తులు 33 కోట్ల దేవతలను కూడా దర్శించుకోవచ్చు. రఘునాథ్ ఆలయ సముదాయంలో మరో 7 ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది.