
మేషం: లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ప్రస్తుతం కుజుడికి చెందిన ధనిష్ఠా నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగ జీవితంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. సోదరులతో ఆస్తి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రావలసిన డబ్బును, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. జీవన శైలి మారుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు కుజ గ్రహానికి చెందిన ధనిష్ఠలో సంచారం చేయడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకోవడంజరుగుతుంది. ఎంత శ్రమకైనా ఓర్చి ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం, ఒక ప్రణాళిక ప్రకారం మదుపు చేయడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రాహువు మీద కుజుడి ప్రభావం పడడం వల్ల ఆత్మవిశ్వాసం, పట్టుదల, తెగువ, చొరవ వంటి లక్షణాలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో సమర్థతను పెంచుకుని అందలాలు ఎక్కుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో ఉన్న రాహువు ధనిష్ఠా నక్షత్రంలో సంచారం చేస్తున్నందు వల్ల ఏ ప్రయ త్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరగడంతో పాటు లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాల్లోనూ, కోర్టు కేసుల్లోనూ సానుకూల పరిష్కారాలు జరుగుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగవుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రాహువు కుజ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులను మించిపోయే అవకాశం ఉంది. ఆశించిన స్థాయి పదోన్నతులతో పాటు వేతనాలు కూడా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

కుంభం: ఈ రాశిలో ఉన్న రాహువు ధనిష్ఠా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి సంబంధించిన ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటు వంటి పోటీ ఎదురైనా విజయాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.