రాహుకేతువులతో వీరికి అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: Oct 09, 2026 | 12:50 PM

Lucky Zodiac Signs: డిసెంబర్ 5, 2026 నుంచి రాహుకేతువులు రాశులు మారనున్నాయి. ఈ రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి రాహు కేతు దోషాల నుంచి విముక్తి పొంది.. అదృష్టాలు పొందుతారు. 2028 మే వరకు ఈ గ్రహాల సంచారం కొనసాగనుండగా, జ్యోతిష్య అంచనాల ప్రకారం మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి రాజయోగాలు, ధన యోగాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి, ఆర్థిక పురోగతి వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి.

1 / 7
మరో 60 రోజుల్లో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతోంది. అంటే మరో రెండు నెలల్లో కొన్ని రాశులకు రాహకేతువుల దోషం తొలగిపోయి అదృష్టాలు పట్టడం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న రాహువు, సింహ రాశిలో ఉన్న కేతువు డిసెంబర్ 5 నుంచి మకర, కర్కాటక రాశుల్లో సంచారం ప్రారంభించి 2028 మే వరకు కొనసాగుతారు. రాహుకేతువులు రాశులు మారినప్పుడు  కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు, అధికార యోగాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహాల వల్ల ఎక్కువగా లాభపడేది, ఉన్నత స్థితిని అనుభవించేది మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశులు.

2 / 7
మేషం: ఈ రాశికి రాహువు దశమ స్థానంలోకి, కేతువు చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి విదేశీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యో గులు విదేశీ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

3 / 7
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు, తృతీయ స్థానంలోకి కేతువు ప్రవేశించడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు తప్పకుండా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు అనుకూలిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.

4 / 7
సింహం: ఈ రాశికి షష్ట స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభి స్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం గానీ, వ్యాపారాలు ప్రారంభించడం గానీ జరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి మూడవ స్థానంలో రాహువు, భాగ్య స్థానంలో కేతువు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారు సంపన్నులు కావడం ప్రారంభం అవుతుంది. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలా పాలు బాగా విస్తరిస్తాయి. ఆస్తి సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది.

6 / 7
మకరం: ఈ రాశిలో రాహువు, సప్తమంలోకి కేతువు ప్రవేశించడం వల్ల ఏ రంగంలో ఉన్నా విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, వృత్తి, వ్యాపా రాల్లో ఘన విజయాలకు అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. ఉద్యో ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రాధాన్యం పెరుగుతుంది.

7 / 7
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆస్తిపాస్తులు కొనడం జరుగుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలను కష్టనష్టాల నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశంఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us