Rahu Transit: రాహువు అనుగ్రహం.. ఆ రాశుల వారికి అనూహ్య అదృష్టం ఖాయం..!

Edited By:

Updated on: Feb 03, 2026 | 1:38 PM

ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువుతో ఫిబ్రవరి మొదటి వారంలో శుక్ర, బుధులు యుతి చెందడం, ఈ గ్రహాల యుతిని గురువు వీక్షించడం వల్ల మార్చి నెల చివరి వరకు కొన్ని రాశులకు రాహువు ఊహించని శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాహువుకు శుక్రుడు గురు సమానుడు. బుధుడు మిత్ర గ్రహం. కుంభ రాశి రాహువుకు మిత్ర క్షేత్రం. మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల రాహువు తనకు ఇష్టమైన కొన్ని రాశులకు తప్పకుండా ధన యోగాలు, అధికార యోగాలు కలిగించడం జరుగుతుంది. రాహువుకు ఇష్టమైన రాశులు వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, కుంభ రాశులు. ఈ మూడు శుభ గ్రహాల ప్రభావం ఉన్నంత కాలం రాహువు ఈ రాశులకు ఏదో రూపంలో అదృష్టాన్ని కలిగిస్తూనే ఉంటాడు.

1 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడికి రాహువు శిష్యుడైనందువల్ల ఈ రాశివారి ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, విదేశీ ఉద్యోగాలు సంపాదించడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. వీరికి రాహువు ఉన్నత స్థాయి శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఒక వెలుగు వెలుగుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం అత్యధికంగా పెరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్నప్పుడు రాహువు సంపూర్ణ ఫలితాలను ఇస్తాడు. ఈ రాశివారికి ఏదో రూపేణా విదేశీయాన యోగం కలిగించడం జరుగుతుంది. ఈ రాశివారికి ఉద్యోగంలోనే కాక, రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. సగటు వ్యక్తి కూడాబాగా సంపన్నుడయ్యే అవకాశం ఉంది.

3 / 6
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఈ రాశివారికి విదేశీ ఉద్యోగావకాశాలు కల్పిస్తాడు. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. ఈ రాశివారికి ధన ధాన్యాలకు లోటుండని పరిస్థితి కలుగుతుంది. శీఘ్రగతిన పదోన్నతులు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతర దేశాల్లో స్థిరపడడానికి కూడా అనేక అవకాశాలు లభిస్తాయి.

4 / 6
తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు రాహువుకు గురుతుల్యుడు అయినందువల్ల ఈ రాశివారికి రాహువు పూర్తి స్థాయిలో అదృష్టాలు కలిగిస్తాడు. సగటు వ్యక్తిని సైతం సంపన్నుడిని చేయడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు, స్థితిగతులకు ఏమాత్రం లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు రాహువుకు మిత్రుడైనందువల్ల ఈ రాశివారిని రాహువు అనేక విధాలుగా వృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశికి రాహువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

6 / 6
కుంభం: రాశినాథుడైన శని రాహువుకు మిత్రుడు అయినందువల్ల రాహువు ఈ రాశివారికి మేలే తప్ప కీడు చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతం కుంభ రాశిలోనే ఉన్న రాహువు ఈ రాశివారిని అనేక విధాలుగా అదృష్టాలు కలగజేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఉచ్ఛ స్థితికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.