
మేషం: ఈ రాశికి ధన, తృతీయ స్థానాల్లో ధన ధాన్య సమృద్ధి యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ ఆరు రోజుల్లో వీరు చేపట్టే ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన శుభ ఫలితాలనిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. భూ సంబంధమైన ఆస్తుల్లోనూ, షేర్ల లోనూ, చిన్న వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.

వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం, శుక్రుడితో యుతి చెందడం, ఆ తర్వాత గురువుతో కలవడం వల్ల ఈ రాశివారిని లక్ష్మీదేవి బాగా కటాక్షించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి సంపన్నుల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

కర్కాటకం: రాశ్యధపతి చంద్రుడు అత్యంత శుభ గ్రహాలైన శుక్ర, గురువులతో యుతి చెందడం వల్ల రెండు మహా యోగాలు కలుగుతున్నాయి. వీటివల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు రెండు శుభ గ్రహాలతో యుతి చెందడం, రెండు లక్ష్మీ యోగాల ఏర్పడడం ఈ రాశివారికి ఉద్యోగ జీవితంలో ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ఉద్యోగ ప్రయత్నమైనా దిగ్విజయంగా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కుంభం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో రెండు మహా యోగాలు ఏర్పడడం వల్ల అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది. లాటరీలు, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా ప్రయోజనం కలుగుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ దిన దినాభివృద్ధి చెందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది.

మీనం: ఈ రాశికి అత్యంత శుభుడైన చంద్రుడు శుక్ర, గురువులతో కలవడం వల్ల ఈ రాశివారికి రెండు విధాలైన లక్ష్మీ యోగాలు కలుగుతాయి. ఆదాయం విశేషంగా పెరుగుతుంది. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. జీవన శైలి మారిపోతుంది.