Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

Edited By:

Updated on: Jan 26, 2026 | 3:38 PM

Family Life Horoscope: ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా కొన్ని రాశుల వారి కుటుంబ జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మిత్ర గ్రహమైన శనికి చెందిన మకర, కుంభ రాశుల్లో శుభ గ్రహాలైన బుధ, శుక్రుల సంచారం జరుగుతున్నందువల్ల ఫిబ్రవరి ఆఖరు వరకు వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారి కుటుంబ జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోవడం, సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబ సభ్యుల విషయంలో శుభవార్తలు వినడం, శుభకార్యాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో బుధుడు కలవడం వల్ల కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కుటుంబ స్థితిగతులు మెరుగుపడి కుటుంబ జీవితం అభివృద్ధి బాట పడుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ధన ధాన్యాలకు లోటుండదు. అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడతారు.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ, శుక్రులు కలయిక ఆదాయం విశేషంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఫలితంగా ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై, మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో వైభవంగా శుభ కార్యాలు, వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి చదువుల్లో, పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 / 6
కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, బుధుల యుతి వల్ల కుటుంబ జీవితంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబపరంగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు జరగడానికి అవ కాశం ఉంది. వైవాహిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందతాయి.  గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

4 / 6
తుల: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో బుధ, శుక్రులు, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబం అనేక విధాలుగా బాగా మెరుగైన స్థితికి చేరుకుంటుంది. కుటుంబంలో చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల సమాగమం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. గృహ యోగానికి అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి ద్వితీయ స్థానంలో బుధ, శుక్రులు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల కుటుంబపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ కార్యం చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ ఆదాయం వృద్ది చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది.

6 / 6
మకరం: ఈ రాశిలో శుక్ర, బుధులు కలిసి ఉండడం, కుటుంబ స్థానాధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలు, అపార్థాలు పరిష్కారమై, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.