
అయితే కొంత మంది పితృదోషం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ఈ మహాలయ అమావాస్య రోజున మూడు మొక్కలు నాటడం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తు పండితులు. కాగా, ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

శమీ మొక్క : అమావాస్య రోజు శమీ మొక్క నాటడం చాలా మంచిది. దీనికి శని దేవుడితో సంబంధం ఉంటుంది. అందువలన శమీ మొక్క నాటడం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించడమే కాకుండా పితృశాపాలు కూడా తొలిగిపోతాయంట.

తులసి మొక్క : తులసి మొక్క చాలా మంచిది. ఇది సానుకూలతను పెంచుతుంది. అయితే పితృ అమావాస్య రోజు ఇంటిలో తులసి మొక్కను నాటుకోవడం వలన పితృశాపాలు తొలిగిపోవడమే కాకుండా కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుందంట.

అశోక మొక్కలు : హిందూ మతంలో అశోక మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అయితే పితృ అమావాస్య రోజున ఈ మొక్కను నాటడం వలన పితృదేవతల ఆశీస్సులు లభించడమే కాకుండా, పితృశాపాల నుంచి విముక్తి కూడా లభిస్తుందంట.

ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు