
అక్టోబర్ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయడం , కదలికలు జరపడం చేస్తున్నాయి. దీని వలన అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా రాబోయే నెలలో నాలుగు రాశుల వారి జీవితాల్లో గొప్ప మార్పు రానుంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. అక్టోబర్ నెలలో గ్రహాల కదలికలు, సంచారం వలన వీరికి కలిసి రానుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : అక్టోబర్ లో మీకు కలిసి వస్తుంది. ఇన్ని రోజులు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వార్త, జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బలంగా మారతారు. పాత అప్పులు తీర్చేస్తారు. వ్యాపారులకు లాభాలు కుమ్మరిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.

తుల రాశి :మీ సొంత నెల అక్టోబర్ మీకు పూర్తిగా కలిసి వస్తుంది. శుక్రుడి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారతాయి.

వృశ్చిక రాశి :అక్టోబర్ లో మీ దశ తిరుగుతుంది. ధన యోగం, లాభ యోగం కలిసి వస్తుంది. ఉద్యోగం లేని వారికి మంచి కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వస్తుంది. పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభం వస్తుంది. అప్పుల బాధ నుండి బయటపడతారు. సంతానం లేని వారికి సంతాన యోగం. ప్రేమించిన వారితో పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు.