ఇంటిలో సంపద, శ్రేయస్సు కోసం జాజికాయ మంత్రం.. దీంతో ఎన్ని లాభాలో..

Updated on: Dec 03, 2025 | 4:32 PM

జాజికాయ వంటల్లోనే కాదు, ఆర్థిక సమస్యలకు కూడా చాలా ఉపయోగపడుతుందంట. ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందంట. ఆర్థికంగా దృఢంగా ఉండాలి అంటే కేవలం కష్టపడితేనే సరిపోదు, కొన్ని సార్లు, కొన్ని పరిహారాలు పాటించాల్సిందే. అయితే జాజికాయతో కొన్ని పరిహారాలు చేయడం వలన అది ఆర్థికపరమైన అడ్డంకులను తెలిగించి, ఇంటిలో సంపద, సానుకూలతను పెంచుతుందంట.

1 / 5
జాజికాయ ముక్కలను ఉపయోగించి, చిన్న దండను తయారు చేసి మెడలో ధరించడం వలన ఇది మీ మనసును శాంత పరచడమే కాకుండా, ఇది అధిక ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తుందంట. అంతే కాకుండా మీరు చేసే పనుల మీద మీ మనస్సు కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది.

2 / 5
మీ ఇంటిలో ప్రతి కూల శక్తి ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు జాజికాయను నిప్పుల్లో కాల్చి, ఇంటి చుట్టూ పొగ వ్యాపించేలా చేయాలంట . ఇలా చేయడం వలన అవాంఛిత శక్తులు దూరం అవ్వడమే కాకుండా, ఇది మీ ఇంటిలో సానుకూల శక్తిని ప్రేరేపిస్తుందంట.

3 / 5
అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు కూడా జాజికాయ మీకు చాలా మేలు చేస్తుందంట. మీరు ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు నుదిటిపై జాజికాయ పొడి లేదా జాజికాయ నూనెను జుట్టుకు పెట్టుకోవడం వలన ఇది కొత్త అవకాశాలను తీసుకొస్తుంది, మీరు వెళ్లే పనిలో విజయవంతం అయ్యేలా చేస్తుందంట.

4 / 5
అదే విధంగా జాజికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి, దానిని మీ పర్స్ లేదా లాకర్, నగదు పెట్టలో పెట్టుకోవడం వలన డబ్బు నిలువ ఉంటుందంట. అంతే కాకుండా ఆదాయం సమకూరుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ప్రేరేపిస్తుందని చెబుతున్నారు పండితులు,

5 / 5
అలాగే మీ ఇంటిలో లేదా, మీ వ్యాపారంలో విజయం సాధించాలి అనుకుంటే, జాజికాయను పవిత్రమైన దారంతో చుట్టీ, మీ కార్యాలయంలో పెట్టడం చాలా మంచిది. ఇది మీ ఇంటిలో అదృష్టం లేదా శ్రేయస్సును తీసుకురావడానికి కారణం అవుతుందంట.