
తుల రాశి : తులా రాశి వారికి నవంబర్ నెల అదృష్టానికి తలుపులు తెరిచినట్టే. శుక్రుడి అనుగ్రహంతో చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త క్లయింట్స్ ద్వారా భారీ లాభం వస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గి ప్రశాంతత వస్తుంది. ఈ నెల మీరు ఏ పని మొదలుపెట్టినా బంగారం అవుతుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి నవంబర్ నెల రాజయోగాల నెల అని చెప్పాలి. గత కొన్ని నెలలుగా ఉన్న మానసిక ఒత్తిడి అంతా పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో డబుల్ లాభం వస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో జాబ్ ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్తాయి. లాటరీ, ఆకస్మిక ధన లాభం కూడా పొందే అవకాశం ఉంది.

మకర రాశి : మకర రాశి వారిని శని దేవుడు ఇన్నాళ్లు పరీక్షించాడు, ఇక పట్టం కట్టే సమయం వచ్చింది. నవంబర్ లో ఏర్పడే శశ రాజయోగం వల్ల మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ఆర్థికంగా ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. సొంత ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. అదృష్టం నక్క తోక తొక్కినట్టు మీ వెంటే ఉంటుంది.

మేష రాశి : మేష రాశి వారికి నవంబర్ నెల కెరీర్ పరంగా గోల్డెన్ మంత్. కుజుడి సంచారం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త ఇల్లు కట్టే పని మొదలుపెడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది, పాత రోగాలు తగ్గుముఖం పడతాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ నవంబర్ నెల ఊహించని మార్పులు తెస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. గురు బలం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది. స్టాక్ మార్కెట్, పెట్టుబడుల్లో లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది.