నవరాత్రుల్లో వీరికి దుర్గాదేవి అనుగ్రహం.. కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు!

Edited By:

Updated on: Oct 09, 2026 | 3:24 PM

Navratri 2026: ఈ నెల(అక్టోబర్) 11 నుంచి 20వ తేదీ వరకు చోటు చేసుకునే నవరాత్రుల్లో గురు, బుధ, శుక్రులు వాటికి అనుకూలమైన స్థానాల్లో బలంగా సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారికి కొద్దిపాటి ప్రయత్నంతో ఘన విజయాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని స్తుతించి వీరు ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. కొద్ది ప్రయత్నం, కృషి, పట్టుదలతో వీరు అనుకున్నవి తప్పకుండా సాధిస్తారు. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు ప్రస్తుత సమయంలో కొద్దిగా దైవానుగ్రహం అవసరం. ఇందుకు దసరా నవరాత్రులు అనుకూలమైన రోజులు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు, సాఫల్యాలు వీరి ఖాతాలో పడడానికి అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశివారు దసరాల్లో దుర్గాదేవిని ప్రార్థించి తమ సహజ లక్షణమైన మొండి పట్టుదలను, లక్ష్యసాధనను ప్రదర్శిస్తే సరిపోతుంది. వీరు తప్పకుండా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఈ నవరాత్రుల కాలంలో ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు రాజయోగాలు, ధన యోగాలు పట్టడం తప్పకుండా జరుగుతుంది. దసరాల్లో  చేపట్టే ప్రతి ప్రయత్నమూ తప్పకుండా విజయవంతం అవుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశివారి దూరదృష్టికి, వ్యూహాలను, ప్రయత్నాలకు దసరాలు పరీక్ష పెట్టబోతున్నాయి. దుర్గాదేవిని ప్రార్థించి వీరు రంగంలోకి దిగే పక్షంలో ఘన విజయాలు వీరి సొంతం అవుతాయి. గ్రహ సంచారాన్ని బట్టి నవరాత్రుల నుంచి దీపావళి వరకు జీవితం నిత్యకల్యాణం పచ్చతోరణంలా సాగే అవకాశం ఉంది. దసరాల్లో ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సొంత వ్యాపారం ప్రారంభించాలన్న వీరి ఆశయం నెరవేరుతుంది.

3 / 6
కన్య: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, అందరినీ కలుపుకునిపోవడం, అనుకున్నది సాధించడం వంటి కన్యా రాశి లక్షణాలు దసరా సమయంలో బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని ప్రార్థించి నడుం బిగించే పక్షంలో వీరు అటు ఆర్థికంగానూ, ఇటు సామాజికంగానూ శీఘ్ర పురోగతి సాధించే అవకాశం ఉంది. విజయాలు సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు.

4 / 6
తుల: ఈ రాశివారి కార్యదీక్ష, వ్యాపార దక్షత, ఉన్నత స్థానానికి చేరుకోవాలనే తపన తప్పకుండా విజ యం సాధించే అవకాశం ఉంది. అయితే, నవరాత్రుల్లో తప్పనిసరిగా దుర్గాదేవి ప్రార్థనలు చేయడం మంచిది. వీరు అనుకున్నది సాధిస్తారు. దీపావళి లోగా వీరి మనసులోని కోరికలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి. దుర్గాదేవీ కటాక్ష వీక్షణాల వల్ల ఊహించని లాభాలు, శుభాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు  బాగా లాభిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశివారిలోని మొండి పట్టుదల, దృఢ సంకల్పం, ఓర్పు, సహనాలకు దుర్గాదేవి కటాక్షం కూడా తోడవడం వల్ల వీరికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. దుర్గాదేవికి భక్తి శ్రద్ధలతో ప్రార్థించే పక్షంలో వీరికి ఊహించని విజయాలు కలుగుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

6 / 6
కుంభం: ఈ రాశివారికి అక్టోబర్ 11 నుంచి గురు, శుక్ర, బుధులతో పాటు రవి, కుజులు కూడా పూర్తి స్థాయిలో బలపడుతున్నం దువల్ల దసరా తరువాత నుంచి వీరికి దశ తిరిగే అవకాశం ఉంది. వీరిలోని కార్యదీక్ష, పోరాటతత్వం, పట్టుదల, ఓర్పులతో పాటు దుర్గాదేవి కటాక్షం వీరిని విజయాల బాటలో నడిపిస్తాయి. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా కలిసి వస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us