Moon Transit: కర్కాటక రాశిలో చంద్రుడు.. ఇక వీరికి అదృష్టమే అదృష్టం!

Edited By:

Updated on: Nov 27, 2026 | 12:47 PM

Moon Transit in Cancer: నవంబర్ 28, 29, 30 తేదీల్లో చంద్రుడు తన స్వస్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల ఆరు రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరడంతో పాటు, ఆదాయ వృద్ధి, ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో ప్రారంభించే పనులు ఎలాంటి శుభ ఫలితాలను అందించనున్నాయో తెలుసుకుందాం.

1 / 7
చంద్రుడు తన స్వస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశులకు తప్పకుండా మనసులోని కోరికలను, ఆశయాలు, ఆశలను నెరవేరుస్తాడు. ఈ నెల(నవంబర్ 2026) 28, 29, 30 తేదీల్లో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులవారు విశేషంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఆ మూడు రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, ప్రాజెక్టులు, చేపట్టే ప్రయత్నాలు 15 రోజుల లోపు తప్పకుండా ఉత్తమ ఫలితాలనిస్తాయి. సానుకూల దృక్పథంతో కొత్త లక్ష్యాలను చేపట్టడం మంచిది. ఆదాయ, ఆరోగ్య ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.

2 / 7
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేసే చంద్రుడి వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరగడానికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి.

3 / 7
మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు ధన స్థానంలోనే సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. పెళ్లి ప్రయ త్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

4 / 7
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు స్వస్థానంలో ప్రవేశించడం వల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగు తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

5 / 7
కన్య: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానంలోనే సంచారం చేయడం వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బాగా మెరుగుపడతాయి.

6 / 7
వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశీ ఉద్యోగాలకు మార్గం సుగ మమవుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వారసత్వపు ఆస్తి గానీ, పిత్రార్జితం గానీ లభించవచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

7 / 7
మకరం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో గానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us