
అయితే ఫిబ్రవరి 3వ తేదీన, బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే శని, రాహు గ్రహాలు అదే రాశిలో ఉండటం వలన ఫిబ్రవరి3న మూడు రాశుల కలయిక జరగబోతుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మకర రాశి : మకర రాశి వారికి గ్రహాల మార్పుల వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. కార్యాలయాల్లో మీ హోదా పెరుగుతుంది. వృత్తి పరంగా కలిసి వస్తుంది కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకుంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గ్రహాల మార్పుల, బుధ గ్రహం అనుకూలత వలన చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపారంలో అత్యధిక లాభాలు అందుకుంటారు. సామాజికంగా హోదా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందడంతో చాలా సంతోషంగా ఉంటారు.

మేష రాశి : బుధుడి గోచారం మేష రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది. కుటుంబంలోని సమస్యలు తగ్గిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు అద్భుతంగా కొనసాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడతారు.

ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఉద్యోగాన్ని పొందుతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.