
జ్యోతిషశాస్త్రం ప్రకారం అదనపు ఆదాయానికి బుధుడు కారకుడు. మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు వంటి ధన సంబంధమైన వ్యవహారాల మీద బుధుడికే ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం తన స్వస్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల కొన్ని రాశులవారు అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. ఈ నెల(జూన్) 22 లోపల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు మదుపులు చేయగలిగితే తప్పకుండా సంపన్నులు, విజేతలు అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలకు, వ్యాపారాల్లో పెట్టుబడులకు, షేర్లకు, ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు అతి తక్కువ పెట్టు బడితో అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా అంచనాల్ని మించి లాభాలు పొందుతారు. స్థలాలు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ధన లాభాలు కలుగుతాయి.

మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం తన స్వస్థానమైన మిథునంలో సంచారం చేస్తున్నందు వల్ల వీరిలో వ్యాపార దక్షత పెరుగుతుంది. మదుపులు, పెట్టుబడులు అత్యధికంగా లాభిస్తాయి. వడ్డీ వ్యాపారాలు, లాటరీలు లాభాల వర్షం కురిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడం కూడా జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కూడా లాభిస్తాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు దశమ కేంద్రంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి సొంత వ్యాపారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. దూరదృష్టితో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ఈ రాశివారు పట్టిందల్లా బంగారమవుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న భాగ్యాధిపతి బుధుడి వల్ల ఈ రాశివారు అతి స్వల్ప కాలంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు వంటి అదనపు ఆదాయం మీద పెట్టే పెట్టుబడులు తప్పకుండా కనక వర్షం కురిపిస్తాయి. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అత్యధికంగా ఆర్థిక లాభాలనిస్తాయి.

ధనుస్సు: ఈ రాశిలో సప్తమ స్థానంలో సప్తమ, దశమాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఏ భాగ స్వామ్య వ్యాపారమైనా కలిసి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు. ఎటు వంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాల్ని మించి ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి బుధుడి సంచారం జరగడం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టుబడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం అత్యధికంగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.