
కుజ గ్రహం ధైర్యానికి , విజయానికి కారకుడు, అయితే ఈ గ్రహం అంటే, నేడు వృషభ రాశిలోకి సంచారం చేయనుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారి ఇంట మాత్రం ధన వర్షం కురిపించనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవం దక్కుతుంది. శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఆనందం డబుల్ అవుతుంది. అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరగడం వలన నూతన వాహనం కొనుగోలు చేయడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం చేస్తుంటారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి పనులను వాయిదా వేస్తూ వచ్చారో, వారు ఈ సమయంలో తమ పనులను పూర్తి చేసుకుంటారు.

సింహ రాశి : సింహ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వీరికి సమాజంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. అన్ని విధాలుగా కలిసి వస్తాయి.