
మేషం: రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి వ్యక్తిగత పురోగతిలో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగ జీవితంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. సోదరులతో ఆస్తి సమస్యల్ని గట్టి పట్టుదలతో పరిష్కరించుకుంటారు. రావలసిన డబ్బును, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు.

వృషభం: ఈ రాశిలో ఉన్న కుజ గ్రహం అత్యంత శుభప్రదమైన రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంత శ్రమకైనా ఓర్చి ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం, ఒక ప్రణా ళిక ప్రకారం ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం బాగా మెరుగుపడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో, అందులోనూ రాశ్యధిపతి చంద్రుడికి చెందిన రోహిణి నక్షత్రంలో కుజ సంచారం వల్ల ఆస్తిపాస్తులు బాగా కలిసి రావడం, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకోవడం జరు గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగు తారు. ఉద్యోగంలో నైపుణ్యాలను, ప్రతిభను, సమర్థతను పెంచుకుని సహోద్యోగుల్ని దాటిపోతారు.

సింహం: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగవుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో రోహిణిలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం అవకాశం ఉంది. ఆశించిన స్థాయి పదోన్నతులతో పాటు వేతనాలు కూడా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి తప్పకుండా అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో రోహిణి నక్షత్రంలో కుజ సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటువంటి పోటీ ఎదురైనా విజయాలు మీకే లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.