Mahabhagya Yoga: శనీశ్వరుడితో చంద్రుడు యుతి..ఈ రాశుల వారికి మహా భాగ్య యోగం..!

Edited By: Janardhan Veluru

Updated on: Nov 24, 2025 | 3:21 PM

Lucky Zodiacs: ఈ నెల(నవంబర్) 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో చంద్రుడు మీన రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న శనీశ్వరుడితో చంద్రుడు యుతి చెందడం జరుగుతుంది. పైగా, గురువుకు చెందిన మీన రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల పరివర్తన యోగం కూడా కలిగింది. ఈ విధమైన గ్రహ మార్పుల వల్ల కొన్ని రాశులకు తప్పకుండా మహా భాగ్య యోగం కలుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో యుతి చెందిన శని, చంద్రుల్ని ఉచ్ఛ గురువు చూడడం, చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశి దశమ స్థానంలో శని, చంద్రులు కలవడం, ఆ యుతిని ఉచ్ఛ గురువు ధన స్థానం నుంచి వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాలు అంచనాలకు మించి పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, లాభాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

3 / 6
కర్కాటకం: రాశినాథుడు చంద్రుడు భాగ్య స్థానంలో శనీశ్వరుడితో కలవడంతో పాటు ఉచ్ఛ గురువుతో పరివర్తన చెందడం వల్ల ఊహించని విధంగా రాజపూజ్యాలు కలుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. లాభదాయక సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి, జీతభత్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

4 / 6
కన్య: ఈ రాశికి  సప్తమ స్థానంలో ఉన్న శనితో చంద్రుడు యుతి చెందడం, లాభ స్థానం నుంచి గురువు దాన్ని చూడడం వల్ల విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. తండ్రి నుంచి ఆస్తి పాస్తులు లేదా సంపద కలిసి వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగాపురోగతి చెందుతారు.

5 / 6
వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర, గురువుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో తప్ప కుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించడమే కాకుండా లాభాల్లో బాగా ముందుంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యక్తి గత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలు పెరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది.

6 / 6
మీనం: ఈ రాశిలో శని, చంద్రుల సంచారం, పంచమ స్థానం నుంచి రాశ్యధిపతి గురువు వీక్షణ వల్ల రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.