2026లో హోలీ రోజే మొదటి చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!

Updated on: Dec 29, 2025 | 10:57 AM

2026 రాబోతుంది. అయితే సంవత్సరంలో సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని చాలా మంది తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఏ గ్రహణం ఏ రాశులపై ఉంది? ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఇలా వీటన్నింటి పై ప్రత్యేక దృష్టిసారిస్తారు. అయితే 2026లో హోలీ పండగ రోజే మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది వస్తూ వస్తూనే మూడు రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5
రాబోయే సంవత్సరంలో మార్చి3న మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే రోజు హోలీ పండుగ.  ఈ గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి, దీనికి నూతక్ కాలం కూడా వర్తిస్తుంది. ఇక చంద్ర గ్రహణం అనేది చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్య కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది.  ఈ సమయంలో చంద్రుడు అర్ధగోళంగా కనిపించడం జరుగుతుంది. అంతే కాకుండా చంద్రుడు ఎరుపు రంగులో బ్లడ్ మూన్‌గా కనిపించడం జరుగుతుంది. దీనిని చంద్రగ్రహణం అంటారు, ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు మంచి ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశులకు చెడు ఫలితాలు ఇస్తుంది.

2 / 5
ఇక వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహణం అనేది అనేక అంశాలపై దాని ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అంతే కాకుండా ఇది భూమిపై ఉన్న ప్రతి జీవిని, మానసికంగా, భావోద్వేగాల పరంగా ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇది మూడు రాశులపై నెగిటివ్ ప్రభావం చూపుతుందంట. అందువలన గ్రహణం సమయంలో ఈ మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, చెబుతున్నారు పండితులు. ఇంతకీ  ఆ రాశులు ఏవి అంటే?

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వరకు హోలీ రోజే చంద్రగ్రహణం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయి. అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రతి పనుల్లో అడ్డంకులు ఎదురు అవుతాయి. ఇతరులతో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. చేపట్టే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురు అవుతాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి అధికం అవుతుంది. ఇంటా బయట సమస్యలు అధికం అవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారు వాటిని రద్దు చేసుకోవడం మంచిది.

5 / 5
మకర రాశి : మకర రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉండనున్నది. వీరికి ఉద్యోగంలో సమస్యలు అధికం అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి బలహీనంగా ఉండటం వలన ఒత్తిడి అధికం అవుతుంది. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. మనీ ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే ఖర్చులు మానసిక ఒత్తిడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.