Lucky Zodiacs: బలమైన రాశ్యధిపతి.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!

Edited By: Janardhan Veluru

Updated on: Dec 10, 2025 | 12:52 PM

ప్రస్తుతం ఆరు రాశులకు రాశ్యధిపతి బాగా బలంగా ఉండడం జరుగుతోంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాశ్యధిపతి బలంగా ఉన్న పక్షంలో ఆ రాశి వ్యక్తి ఎటువంటి సమస్యనుంచయినా బయటపడడం, విజయాలు సాధించడం, ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. సుమారు నెలన్నర పాటు మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులకు పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఈ రాశులవారు సరైన ప్రయత్నాలు చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

1 / 6
మేషం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

2 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో రవితో కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారికి రాజయోగం పట్టే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది.

3 / 6
సింహం: రాశ్యధిపతి రవి మరో నెలన్నర పాటు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగానికి ప్రయత్నిస్తున్నవారి ఆశలు నెరవేరుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, వ్యాపారాల్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరడంతో పాటు వాహనం కూడా కలుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు మరో నెల రోజుల పాటు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగం కలుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విలాస జీవితం అనుభవిస్తారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ది ఎక్కువగా ఉంటుంది.

5 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో, మిత్ర క్షేత్రంలో ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

6 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి దేనికీ లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.