
అంతా రామమయం.. జగమంతా రామమయం అనిపించేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. రామభక్తులు రాములోరికి కానుకలను అందిస్తున్నారు. అదే సమయంలో కొందరు వివిధ రకాలుగా తమ భక్తిని ప్రకటిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని గడగ్‌లోని ఓ బేకరీ షాపులో అయోధ్య శ్రీరామ మందిరం తరహాలో ఓ కేకుని తయారు చేశారు. ఈ కేకు కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

నాలుగు రోజుల్లో (ఈనెల 22న) అయోధ్య శ్రీరామ మందిరంలోని గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠపన కార్యక్రమం జరగనుంది.

రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలో సందడి నెలకొంది. ఓ వైపు రామయ్య అక్షతలను గడపగడపకు వితరణ చేస్తున్నారు. మరోవైపు కళాకారులు వివిధ రకాల కళాఖండాలను సృష్టిస్తున్నారు. రామభక్తులు మట్టితో రాముని విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఆలయాకృతిలో రకరకాల కళాకృతులను తయారు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గడగ్ నగరంలో కూడా శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ససనురా బేకరీ షాపులో శ్రీరామ మందిరం నిర్మాణానికి ప్రతిరూప్యాన్ని కేక్ తో సృష్టించారు.

కేక్‌తో చేసిన ఈ అందమైన అయోధ్య దేవాలయం లైట్లతో మెరిసిపోతోంది. వినియోగదారులను ఆకర్షిస్తోంది.

శ్రీరామ మందిరం కేక్ ను చూసేందుకు ప్రజలు దుకాణానికి తరలివస్తున్నారు. కేక్ రామమందిరంతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

అయోధ్య రామమందిరానికి సంబంధించిన 20-25 కిలోల బరువైన కేక్ నమూనాను తయారు చేశారు బేకరీ సిబ్బంది. ఈ కేక్ తయారీలో సుమారు 10 మంది కార్మికుల పని చేశారు. తమ నైపుణ్యంతో రామమందిరాన్ని నిర్మించారు.

కేక్‌గా తయారు చేసిన రామమందిర నమూనా జనవరి 22 వరకు ప్రదర్శించబడుతుందని బేకరీ షాప్ యాజమాన్యం వెల్లడించింది.