కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ..! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..

Edited By:

Updated on: Jun 05, 2026 | 1:23 PM

Kalasarpa Dosha: కాలసర్ప దోష ప్రభావంతో జూన్ 7 నుంచి 21 వరకు గ్రహాలన్నీ రాహువు–కేతువు మధ్య సంచారం చేయనున్నాయి. అయితే గురు బలం కారణంగా మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఇది మహాయోగంగా మారే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతి లభించడం, వృత్తి–వ్యాపారాల్లో లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 7
గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య సంచారం చేయడాన్ని కాలసర్ప దోషమంటారు. ఇవి రెండూ పాపగ్రహాలైనందువల్ల వీటి మధ్య గ్రహాలన్నీ సంచారం చేయడం కొన్ని కష్టనష్టాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నెల(జూన్) 7 నుంచి 21 వరకు గ్రహాలన్నీ రాహువు (కుంభం), కేతువు (సింహం) ల మధ్య ఉంటున్నందువల్ల ఈ కాలసర్ప దోషం కలిగింది. అయితే, గురు బలం వల్ల కొన్ని రాశులకు ఇదే ఒక మహా యోగంగా, మహర్దశగా పరిణమించే అవకాశం కూడా ఉంది. మేషం, మిథు నం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ఈ కాల సర్ప దోషం వల్ల ఆదాయం పెరగడానికి, ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడానికి అవకాశం ఉంది.

2 / 7
మేషం: ఈ రాశికి లాభ, పంచమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల కాలసర్ప యోగం ఏర్పడింది. అయితే, చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారికి అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. రాహువు విదేశాలకు కారకుడైనందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం సద్వినియోగం అవుతుంది. సహాయాలు, దానధర్మాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు.

3 / 7
మిథునం: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో కాలసర్ప యోగం ఏర్పడుతున్నందువల్ల, విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం రావడానికి, విదేశీ సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభించడం, జీత భత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక దన ప్రాప్తికి అవకాశం ఉంది.

4 / 7
కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో కేతువు, షష్ట స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశికి కాలసర్ప యోగం కలిగింది. ఉద్యోగంలో పదోన్నతులు, ప్రాధాన్యం, ప్రాభవం పెరగడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు పెంపొందుతాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు బాగా లాభిస్తాయి.

5 / 7
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు, లాభ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి  లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల సహ కారం లభిస్తుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

6 / 7
ధనుస్సు: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో కాలసర్ప యోగం ఏర్పడినందువల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి.

7 / 7
మీనం: ఈ రాశికి షష్ట, వ్యయ స్థానాల్లో కాలసర్ప యోగం ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, వారసత్వ సంపద లభించడానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి తప్పకుండా వృద్ధి చెందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సుఖ సంతోషాలతో సాగిపోతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Follow Us