
మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురు, కేతువులు యుతి చెందడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆదాయం పెరగడానికి, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రుణ సమస్యలు చాలావరకు తగ్గి పోతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలనిస్తాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశివారికి ధన స్థానంలో గురు, కేతువుల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఎలాంటి ప్రయత్నం చేప ట్టినా ఆటంకాలు లేకుండా నెరవేరుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో రాబడికి లోటుండదు. ఆస్తులకు సంబంధించిన వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

సింహం: ఈ రాశిలో గురు, కేతువుల సంచారం వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. అనుకోని మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి, లాటరీలు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. మదుపులు, పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో గురు, కేతువుల సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆక స్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులే షన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి అవకాశం ఉంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కూడా పడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఊహించని పిత్రార్జితం లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురు, కేతువుల వల్ల ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాటరీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తులు వృద్ధి చెందే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి గురువుతో కేతువు యుతి చెందడం వల్ల ఒకటికి రెండు సార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాల్ని మించుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మదుపులు, పెట్టుబడుల వల్ల అపార లాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది.