కలియుగంలో లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమల్లో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా ఏడుకొండలపై వెలిశాడు. పద్మావతిని పెళ్లి చేసుకున్న శ్రీవారిని లక్ష్మీదేవి నిలదీయంతో స్వామివారు శిలగా మారిపోయారని స్థల పురాణం.
పవిత్ర క్షేత్రంలో పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం ఇలా సుమారు కోటి తీర్ధాలున్నాయని భక్తుల నమ్మకం
తిరుమల కొండపై వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఉంది. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. ఇక్కడ ఉన్న వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని స్థల పురాణం.
స్వామివారి క్షేత్రంలో పాపనాశనం.. ఇది కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఈ జలపాతానికి పాపనాశనం తీర్థమని పేరు
వేంకటేశ్వరస్వామి వారి ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి విశిష్టత కలిగిఉంది. వైకుంఠంలోని పుష్కరిణి అని భక్తుల నమ్మకం. విష్ణువు భూమిపైకి రావడంతో ఆయన వాహనమైన గరుత్మంతుడు పుష్కరిణిని ఇక్కడకు తీసుకొచ్చినట్లు పురాణాల కథనం.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గర్భగుడి చుట్టూ బయటకు వెళ్లే క్రమంలో విమాన వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం
పవిత్ర క్షేత్రంలో పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం ఇలా సుమారు కోటి తీర్ధాలున్నాయని భక్తుల నమ్మకం