
వృషభ రాశి : గురు గ్రహం ఈ రాశిలో నాలుగవ ఇంటిలో సంచరిస్తుంది. అందువలన వీరు చాలా వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఇల్లు, వాహనం , కుటుంబానికి సంబంధించిన బాధ్యతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అంతే కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఖర్చులు పెరుగుతాయి. అందువలన వీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి : మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చాలా సమస్యలను తీసుకొస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నవంబర్ 1 నుంచి వీరు ఆర్థికంగా కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కుంటారు.

సింహ రాశి : సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ కష్టానికి తగిన ఫలితం లభించదు. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వేధిస్తాయి. చాలా వరకు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడ చాలా ఇబ్బంది పడతారు.

కన్యా రాశి : కన్యా రాశి రాశి వారికి గురు గ్రహం 12వ ఇంటిలో సంచారం చేయనుంది. దీని వలన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో గొడవలు, కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. పెట్టు బడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం.

నోట్ : పై సమాచారం, శాస్త్రీయ పరంగా నిరూపణ జరగలేదు, ఇది కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. అందువలన టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.