
వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరించడం జరిగింది. అదే విధంగా అదృష్టం కలిసి వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి వాస్తు శాస్త్రం చెబుతుంది. కాగా, ఏ సంకేతాలను బట్టి ఇంటిలో మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి అని తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పక్షుల కిలకిలలు : వాస్తు శాస్త్రం ప్రాకారం ఏ ఇంటి చుట్టు అయితే చిలకలు, గుడ్ల గూబ తిరుగుతూ కనిపిస్తుందో ఆ ఇంటికి త్వరలో అదృష్టం రాబోతుంది అన్నట్లు. గుడ్ల గూబ లక్ష్మీదేవి వాహనం, అందువలన ఇంటి చట్టు గుడ్ల గూబ తిరుగుతుంది అంటే, త్వరలో మీ ఇంటిలో సంపద పెరుగుతుంది అని అర్థం. ఇక పక్షల కిలకిలలు కూడా ఇంటిలో ఆనందాన్ని సూచిస్తాయంట.

తామర పువ్వు : కలలు రావడం సహజం. ఇక కలలో ఒకొక్కరికీ ఒక్కో వస్తువు కనిపిస్తుంది. అయితే ఎవరి కలలో అయితే తామర పువ్వు కనిపిస్తుందో, వారికి అదృష్టం కలగనున్నది అని అర్థం అంటున్నారు పండితులు. కమలం పువ్వు కొత్త ప్రారంభాలు, సానుకూలతను సూచిస్తుంది. ఇది కలలో కనిపించడం వలన ఇంటిలో శుభ ఫలితాలు కలుగుతాయంట.

ఆవు : ఇంటి ముందుకు ఆవు రావడం కూడా చాలా మంచిది. ఇది శుభ సూచకం. అంతే కాకుండా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆవు ఎదురు వస్తే కూడా మీకు అదృష్టం కలుగుతుంది అని అర్థం. ముఖ్యంగా దూడ ఆవు పాలు తాగుతూ కనిపిస్తే, అది విజయానికి సంకేతం అంటున్నారు నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు