Job Astrology: ఆ రాశులకు జాబ్‌లో జాక్‌పాట్..! ఇక గోల్డెన్ పీరియడ్ మొదలైంది

Edited By:

Updated on: Apr 13, 2026 | 4:14 PM

దశమ స్థానాన్ని బట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల స్థితిగతులను నిర్ధారించాల్సి ఉంటుంది. దశమ స్థానంలో సంచారం చేసే గ్రహాన్ని బట్టి కెరీర్ పరంగా పురోగతి ఎలా ఉండబోతున్నదీ అర్థం అవుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చిక రాశులకు కొద్ది రోజుల్లో ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పదోన్నతులు, ఉద్యోగంలో మార్పులు, బదిలీలు, బాధ్యతలు వంటివి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహాల వల్ల ప్రభావితమవుతాయి. అనుకూలతలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

1 / 5
వృషభం: ఈ రాశికి మరో ఎనిమిది నెలల పాటు దశమ స్థానంలో రాహువు సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా తరచూ మార్పులు, చేర్పులతో బిజీగా సాగిపోయే అవకాశం ఉంది. దశమంలో రాహువు సంచారం చేస్తున్నప్పుడు సహోద్యోగులు, సీనియర్లు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

2 / 5
మిథున రాశి వారికి  శుక్రాదిత్య రాజయోగం వల్ల అప్పటి వరకు ఉన్న కష్టాలు మొత్తం పోతాయి. ఇది వీరికి మంచి సమయం. కుటుంబం నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. ఈ సమయంలో వీరు  హ్యాపీగా ఉంటారు. డబ్బు విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రావు.

3 / 5

కర్కాటక రాశి వారు ఎన్నో కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో అంతా ఎదురు వస్తుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్లవు. 
 ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. కానీ, శని మీకు విజయాన్ని ఇస్తాడు అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.

కర్కాటక రాశి వారు ఎన్నో కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో అంతా ఎదురు వస్తుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్లవు. ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. కానీ, శని మీకు విజయాన్ని ఇస్తాడు అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.

4 / 5
కన్య: ఈ రాశికి మరో రెండు నెలల పాటు దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో పదో న్నతి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఉద్యోగం మారే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవాలతో పాటు గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం తప్పకుండా కలుగుతుంది.

5 / 5
వృశ్చికం: ఈ రాశికి ఈ ఏడాది చివరి వరకు దశమంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో తరచూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటుంటాయి. బాధ్యతల మార్పు, అధికారాల మార్పు ఎక్కువగా జరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. పని ఒత్తిడి వల్ల విశ్రాంతి కరువయ్యే అవకాశం ఉంది.

Follow Us