
వెరైటీ.. వెరైటీ.. వెరైటీ..బొజ్జ గణపతికి వినూత్న ఆకారాలతో పాటు వివిధ రూపాలు దిద్దే భక్తజనం ఆయనకు వేసే దండలు కూడా డిఫరెంట్ ఆలోచనలతో వేస్తున్నారు. పూలదండలతో పూజలు రొటీన్.. ఇప్పుడు నకిలీ కరెన్సీ దండాలు కూడా మార్కెట్ లోకి వచ్చేసాయి.

పిల్లలు ఆడుకునే ఫేక్ కరెన్సీ తో పూలదండలు తయారుచేసి విక్రయాలు జరుపుకున్నారు.. పూల వ్యాపారులే ఈ దండలను అల్లి డిఫరెంట్ ఆకారంలో గణపతికి ఫేక్ కరెన్సీ తో గజమాలలు తయారు చేశారు. వీటిని పూలదండలతో పాటే విక్రయాలు జరుపుతున్నారు y

వరంగల్ , హనుమకొండ పూల వ్యాపారులు పూలతో తయారు చేసిన గజమాలతో పాటు ఫేక్ కరెన్సీ గజమాలలు విక్రయాలు జరుపుతున్నారు.. పూల దుకాణాలలో దర్శనమిస్తున్న ఈ కరెన్సీ గజమాలలు చూపరులను ఆశ్చర్య పరుస్తున్నాయి..

కరెన్సీ గజమాలలో 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 10 రూపాయల ఫేక్ నోటు కూడా ఉపయోగించి ఈ విధంగా భారీ గజమాలలు తయారు చేశారు.. ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఈ ఫేక్ కరెన్సీ దండలు ఫుల్ ట్రెండ్ గా మారాయి

పూలదండల కోసం వెళ్లిన భక్తులు ఉత్సవ కమిటీలు ఈ కరెన్సీ దండలు చూసి షాక్ అవుతున్నారు.. సహజంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొన్ని ప్రాంతాలలో శుక్రవారం రోజు ఘనపయ్యను పూర్తిగా వర్జినల్ కరెన్సీతో అలంకరించి పూజలు చేస్తారు. కుంకుమ పూజ నిర్వహిస్తారు.. కానీ ఇప్పుడు పూల వ్యాపారులు నకిలీకరణతో ఇలా దండలు తయారు చేయడం జనంలో చేర్చగా మారుతుంది.. అంతా గణపయ్య లీలలు అని చర్చించుకుంటున్నారు.