
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించి వీరు కొద్ది ప్లానింగుతో పురోగమించడం మంచిది. కుటుంబపరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందడంతో పాటు మొండి బాకీలు, బకాయిలు కూడా పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి.

మిథునం: ఈ రాశిలో శక్తిమంతమైన గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. అనేక వైపుల నుంచి అదనపు ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. లాభదాయక ఒప్పం దాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తులు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు చంద్రులు కలవడం ఈ రాశివారికి అన్ని విధాలా ఆదాయాన్ని వృద్ధి చేస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అన్ని వైపుల నుంచి అదనపు ఆదాయం పెరుగు తుంది. ఉద్యోగంలో కూడా అదనపు ఆదాయం, భత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ విస్తరిస్తుంది. కుటుంబపరంగా, ఆస్తిపాస్తులపరంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు చంద్రులు కలిసి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు స్థిరపడతారు. ఆస్తిపాస్తులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు చంద్రుడిని కలవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు చంద్రుల కలయిక వల్ల మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఎటువంటి లక్ష్యాలనైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలను అమర్చుకుంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.