Feb 2026 Astrology: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!

Edited By:

Updated on: Jan 26, 2026 | 5:03 PM

Febraury 2026 Lucky Horoscope: ఫిబ్రవరి నెలలో నాలుగు గ్రహాలు కుంభ రాశిలో ప్రవేశించబోతున్నాయి. ఫిబ్రవరి 4న బుధుడు, 6న శుక్రుడు, 13న రవి, 23న కుజుడు కుంభ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల కొన్ని రాశుల వారు అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోకి రావడం జరుగుతుంది. మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాల్లో శుభవార్తలు, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆదాయం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, కుటుంబం, పెళ్లి వంటి విషయాల్లో ఈ రాశులవారికి కలలో కూడా ఊహించని అనుకూలతలు కలుగుతాయి.

1 / 6
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో శుక్ర, బుధ, రవులు కలవడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

2 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు నాలుగు గ్రహాలు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగ జీవితంలో అనేక విధాలుగా అదృష్టం కలుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది.

3 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడితో మూడు గ్రహాలు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడ్డ వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో మూడు గ్రహాలతో కలవడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, బుధ, రవి, శుక్ర గ్రహాలు కలవడం వల్ల ఫిబ్రవరి నెలంతా ఈ రాశివారు రాజభోగాలు అనుభవించే అవకాశం ఉంది. సిరిసంపదలు, భోగభాగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాటపడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల తప్పకుండా ధన ధాన్య సమృద్దికి అవకాశం ఉంది. ఆదాయం, వృత్తి, ఉద్యోగాలు వంటి విషయాల్లో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.