Jupiter Blessings: గురు గ్రహం ఆశీస్సులు.. ఇక ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!

Edited By:

Updated on: Mar 24, 2026 | 6:36 PM

జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా గుర్తింపు పొందిన గురు గ్రహం ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని రాశుల వారికి అనూహ్యమైన అదృష్టాలు పడతాయి. వారి జీవితాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. దేవ గురువు జూన్ 3 నుంచి 2027 జూలై వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఏ దోషాలూ, ఏ అవయోగాలూ అంటని పరిస్థితి ఏర్పడింది. గురువు కర్కాటక రాశిలో ఉన్నంత వరకూ వీరి జీవితాలు ఉన్నత స్థితిలో సాగిపోతాయి. వీరు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టగలుగుతారు. బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు.

1 / 6
మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. అత్యంత ఉన్నత స్థాయి యోగంగా భావించే హంస మహా పురుష యోగం కలుగుతుంది. వీరికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తేలికగా నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది.

2 / 6
మిథునం: ధన స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారి జాతకంగా ఎటువంటి దోషాలున్నా, అవయోగాలున్నా కొట్టుకుపోతాయి. ఇతర గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఆదాయ వృద్ధికి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆశలు, ఆశయాల విషయంలో అనుకున్నది సాధిస్తారు.  ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు ఈ రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి ఇక ఘన విజయాలే తప్ప ఓటమి ఉండదు. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద ఎప్పుడూ పైచేయిగానే ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి అత్యంత శుభుడైన గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, ఈ రాశిని పూర్ణ బలంతో వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారి దశ తిరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీరు పట్టిం దల్లా బంగారం అవుతుంది. వీరిని ఎటువంటి దోషాలూ అంటే అవకాశం లేదు. వీరికి గురువు నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. కలలన్నీ సాకారమవుతాయి. సంపన్న స్థితి కలగడంతో పాటు సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల జీవితంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ లక్ష్యాలను, అంచనాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఆస్తిపాస్తులు లభిస్తాయి.

6 / 6
మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి విజయాలే తప్ప ఓటమి ఉండకపోవచ్చు. ఏలిన్నాటి శని దోషం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. అధికారులకు వీరి సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు  అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. షేర్లు బాగా లాభిస్తాయి.

Follow Us