Astrology: వెండి ధరిస్తే నిజంగా ఈ రాశుల వారికి సమస్యలా? జ్యోతిష్య పరిష్కారం

Updated on: May 07, 2026 | 10:09 AM

Silver Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి ఆభరణాలు ఏ రాశివారికీ పూర్తిగా నిషేధం కాదు. అయితే చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాల్లో వెండి ధరించడం కొన్నిసార్లు అనుకూలం కాకపోవచ్చు. వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉండటంతో ఇది మనస్సుకు శాంతి, భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది. అందువల్ల ఇది సాధారణంగా శాంతి ఇచ్చే లోహంగా భావిస్తారు. ఏ రాశికి అనుకూలం/ప్రతికూలం అనేది వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది.

1 / 6
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారికీ వెండి ఆభరణాలు పూర్తిగా నిషేధించబడలేదు. అయితే, వ్యక్తిగత జాతకంలో చంద్రుడి స్థానం బలహీనంగా లేదా పీడితంగా ఉంటే.. వెండి ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని కొంతమంది జ్యోతిష్యులు అభిప్రాయపడతారు. వెండి చంద్రుడితో సంబంధం కలిగి ఉండటంతో, ఇది మనస్సు, శాంతి, భావోద్వేగ సమతుల్యత, శ్రేయస్సును సూచిస్తుంది. సాధారణంగా ఇది శాంతిని కలిగించే లోహంగా భావించబడుతుంది. కొన్ని రాశుల వారికి వెండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారికీ వెండి ఆభరణాలు పూర్తిగా నిషేధించబడలేదు. అయితే, వ్యక్తిగత జాతకంలో చంద్రుడి స్థానం బలహీనంగా లేదా పీడితంగా ఉంటే.. వెండి ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని కొంతమంది జ్యోతిష్యులు అభిప్రాయపడతారు. వెండి చంద్రుడితో సంబంధం కలిగి ఉండటంతో, ఇది మనస్సు, శాంతి, భావోద్వేగ సమతుల్యత, శ్రేయస్సును సూచిస్తుంది. సాధారణంగా ఇది శాంతిని కలిగించే లోహంగా భావించబడుతుంది. కొన్ని రాశుల వారికి వెండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుంది.

2 / 6

మేష రాశి: 
కుజ గ్రహం అధిపత్యం కలిగిన మేష రాశి వారు కొన్నిసార్లు భావోద్వేగ అస్థిరత లేదా చంచలత్వాన్ని అనుభవించే అవకాశం ఉందని భావిస్తారు. అలాంటి సందర్భాల్లో వెండి ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.

మేష రాశి: కుజ గ్రహం అధిపత్యం కలిగిన మేష రాశి వారు కొన్నిసార్లు భావోద్వేగ అస్థిరత లేదా చంచలత్వాన్ని అనుభవించే అవకాశం ఉందని భావిస్తారు. అలాంటి సందర్భాల్లో వెండి ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.

3 / 6

సింహ రాశి: 
సూర్యుడి అధిపత్యం కలిగిన సింహ రాశి వారికి నిర్ణయాలలో గందరగోళం లేదా అయోమయం ఏర్పడే అవకాశముందని కొంతమంది జ్యోతిష్యులు సూచిస్తారు. ఈ రాశి వారు కూడా వెండి ధరించకపోవడం మంచిది.

సింహ రాశి: సూర్యుడి అధిపత్యం కలిగిన సింహ రాశి వారికి నిర్ణయాలలో గందరగోళం లేదా అయోమయం ఏర్పడే అవకాశముందని కొంతమంది జ్యోతిష్యులు సూచిస్తారు. ఈ రాశి వారు కూడా వెండి ధరించకపోవడం మంచిది.

4 / 6

ధనుస్సు రాశి: 
గురు గ్రహాధిపత్యం ఉన్న ధనుస్సు రాశి వారికి కొన్ని సందర్భాల్లో ఆర్థిక లేదా మనోభావ అసంతృప్తి కలగవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారు కూడా వెండి ఆభరణాలు ధరించకపోవడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ధనుస్సు రాశి: గురు గ్రహాధిపత్యం ఉన్న ధనుస్సు రాశి వారికి కొన్ని సందర్భాల్లో ఆర్థిక లేదా మనోభావ అసంతృప్తి కలగవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారు కూడా వెండి ఆభరణాలు ధరించకపోవడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

5 / 6

మకర రాశి: 
శని గ్రహాధిపత్యం కలిగిన మకర రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. ఈ ప్రభావాలు ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండవు. వెండి ధరించడం వల్ల కలిగే ఫలితాలు పూర్తిగా వ్యక్తిగత జాతకంలోని చంద్రుని స్థానం, ఇతర గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటాయి.

మకర రాశి: శని గ్రహాధిపత్యం కలిగిన మకర రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. ఈ ప్రభావాలు ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండవు. వెండి ధరించడం వల్ల కలిగే ఫలితాలు పూర్తిగా వ్యక్తిగత జాతకంలోని చంద్రుని స్థానం, ఇతర గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటాయి.

6 / 6
వెండి సాధారణంగా శాంతి, సానుకూల శక్తి, సౌఖ్యాన్ని పెంచే లోహంగా పరిగణించబడుతుంది. చాలా రాశుల వారికి ఇది అనుకూలంగా కూడా ఉండవచ్చు. అందువల్ల, ఏ ఆభరణం ధరించాలన్నా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి జ్యోతిష్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

వెండి సాధారణంగా శాంతి, సానుకూల శక్తి, సౌఖ్యాన్ని పెంచే లోహంగా పరిగణించబడుతుంది. చాలా రాశుల వారికి ఇది అనుకూలంగా కూడా ఉండవచ్చు. అందువల్ల, ఏ ఆభరణం ధరించాలన్నా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి జ్యోతిష్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us