
హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. "దీపం జ్యోతిః పరంబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. చీకటిని చీల్చుకుంటూ కాంతిని ప్రసరింపజేస్తుంది. దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, అందుకనే దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.

సర్వసాధారణంగా దీపారాధనకు రోజు.. ఉపయోగించేది దూది చేసిన వత్తిని. పత్తి తో చేసిన వత్తి తో కూడిన దీపం వెలిగిస్తే.. అదృష్టం కలిసి వస్తుందట.

సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన జిల్లేడు పూలను ఎండబెట్టి.. అనంతరం వాటినుంచి గింజలను తీసుకుని దూది లాంటి పదార్ధంతో వత్తులు చేసి.. దానితో వినాయకుడికి దీపారాధారణ చేస్తే.. ఆరోగ్యంగా జీవిస్తారట.

ఇక లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తామరపువ్వు కాండంతో చేసిన వత్తితో దీపారాధన చేస్తే.. లక్ష్మి, సరస్వతి కటాక్షము లభిస్తాయని నమ్మకం.

వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని అనుకునేవారు పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవాలని.. అందుకని అమ్మవారికి పసుపు వస్త్రంతో చేసిన వత్తులతో చేసిన దీపారాధన చేయాలి. ఇలా చేస్తే దంపతుల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరిగి.. సుఖ సంతోషాలతో జీవిస్తారని పెద్దలు చెబుతారు.