December Horoscope: డిసెంబర్ నెలలో ఈ రాశుల వారికి విజయం, అదృష్టం.. ఇందులో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: Nov 24, 2025 | 4:02 PM

డిసెంబర్ నెలలో గురువు కర్కాటక రాశి నుంచి తిరోగమించి మళ్లీ మిథున రాశి ప్రవేశం చేయబోతున్నాడు. శని వక్ర త్యాగం చేసి మీన రాశిలో కొనసాగుతాడు. కుజ, శుక్ర, బుధ, రవులు రాశులు మారడం జరుగుతుంది. ఈ మార్పుల ఫలితంగా వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు తిరుగులేని అదృష్టవంతులు కాబోతున్నారు. కొత్త ప్రయత్నాలు చేపట్టడం చాలా మంచిది. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.

1 / 6
వృషభం: శుభ గ్రహాల అనుకూలత పెరగడం వల్ల డిసెంబర్ నుంచి ఈ రాశివారికి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశివారికి డిసెంబర్ నెల ఊహించని అదృష్టాలు తీసుకువస్తుంది. శుభ ఫలితాలు  ఎక్కువగా అనుభవానికి వస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయవృద్ది ప్రయత్నాలను పెంచడం మంచిది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

3 / 6
సింహం: డిసెంబర్ మొదటి వారంలో గురువు లాభస్థానంలోకి రావడం, రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో సంపన్ను లయ్యే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు అదృష్టాన్ని పండిస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

4 / 6
తుల: డిసెంబర్ మొదటి వారంలో గురువు మళ్లీ భాగ్య స్థానంలోకి, శుక్రుడు ధన స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ఆస్తి పాస్తుల విలువ బాగా పెరగడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, సొంత ఇల్లు అమరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు.

5 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు మిథున రాశి ప్రవేశం వల్ల ఈ రాశివారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి, ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అదనపు ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.

6 / 6
మకరం: ఈ రాశివారికి డిసెంబర్ మాసమంతా అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలే కాక అదనపు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదిరే సూచనలున్నాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.