
దిన ఫలాలు (నవంబర్ 6, 2026): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో ఎదురు చూస్తున్న మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు వ్యవహా రాలు సానుకూల పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. మిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. సుందరకాండ పారాయణం చేయడం మంచిది.
ఉద్యోగంలో ఎదురు చూస్తున్న మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. ఆర్థిక విష యాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం ఉండదు. లలితా సహస్ర నామం పఠించడం మంచిది.
ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదం ఒకటి బంధువుల జోక్యంతో పరిష్కారం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివార్చన చేయడం వల్ల లాభముంటుంది.
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. ఉద్యోగంలో సహచరులతో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో భాగస్వాములతో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని కీలకమైన పనులు సానుకూలపడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు దగ్గర బంధువుల కారణంగా ఆర్థికంగా చిక్కుల్లో పడవచ్చు. శివార్చన చేయించడం మంచిది.
ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా పురోగమిస్తాయి. ఆర్థిక విషయాలకు, ఆరో గ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. శివార్చన చేయించడం వల్ల శని దోషం చాలావరకు తగ్గుతుంది.
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగుతుంది. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల వ్యవహార జయం ఉంటుంది.
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయానికి లోటుండదు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కుటుంబ సమ స్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, గౌరవ మర్యాదలు పెరగడం వంటివి జరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యానికి ఆహ్వానం అందుతుంది. దుర్గాదేవికి ప్రార్థన చేయడం మంచిది.
ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో రోజంతా సానుకూలంగా, ఆశించిన విధంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతల్ని సంతృ ప్తికరంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సుబ్రహ్మణ్యాష్టక పఠనం వల్ల మానసిక ఆందోళన బాగా తగ్గుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయినప్పటికీ, సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అయి, దూర ప్రాంతాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.
ఉద్యోగంలో సహచరులతో కలిసి ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికా రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. ఎవరికీ హామీలు ఉండడం కానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. సుందరకాండ పారాయణం వల్ల కొన్ని శుభఫలితాలు అనుభవానికి వస్తాయి.
ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృత్తి, ఉద్యో గాలు నిలకడగా, ప్రశాంతంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికర స్థాయిలో లాభాలు తెచ్చి పెడతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగానే కాక కుటుంబపరంగా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టదైవానికి మరింత శ్రద్ధగా ప్రార్థనలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.