
గ్రహాలు మారడం వల్ల, యోగాలు కలగడం వల్ల జీవితాల్లో తప్పనిసరిగా అనుకూలతలు పెరుగు తాయి. అయితే, కొన్ని యోగాలకు కొద్దిపాటి ప్రయత్నంతో పాటు, సంకల్ప బలం కూడా అవసరం. ఈ నెల(ఆగస్టు) 9, 10, 11 తేదీల్లో మిథున రాశిలో చోటు చేసుకోబోతున్న కుజ చంద్రుల యుతి, అంటే చంద్ర మంగళ యోగం విషయంలోనూ కొద్దిపాటి ప్రయత్నం, కొద్దిగా సంకల్ప బలం అవసరం. జాతకంలో చంద్ర మంగళ యోగం ఉంటే చాలు, ఆ జాతకులకు దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మేషం, మిథునం, సింహం, తుల, కుంభం, మీన రాశులవారు ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నంతో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది.

మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానాధిపతి చంద్రుడితో తృతీయ స్థానంలో కలవడం వల్ల ప్రయత్న పూర్వక ధన లాభం కలుగుతుంది. శత్రువుల నుంచి సైతం ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి వివా దాలు సానుకూలంగా పరిష్కారం కావడం, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, వడ్డీ వ్యాపారాల్లో విజయాలు సాధించడం వంటివి జరుగు తాయి. ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా రాబడి బాగా పెరగడం కూడా జరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి సంపాదన పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ అపర కుబేర యోగం ఏర్పడుతున్నందువల్ల, అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని, మిగులు ఆదాయాన్ని ఇళ్లు, స్థలాలు, పొలాల మీద పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. షేర్ల వ్యాపారం ద్వారా సంపాదించే సూచనలు కూడా ఉన్నాయి. తల్లి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందు తుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర మంగళ యోగం పడుతున్నందువల్ల, ప్రయత్నపూర్వక ధన లాభానికి, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీతభత్యాల పరంగా కూడా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. అదనపు సంపాదనకు వీలుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు అంచనాలకు మించి లాభిస్తాయి. వ్యాపారాల్లో మదుపు చేయడం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ ధన ధాన్య సమృద్ధి యోగం చోటు చేసుకోవడం నిజంగా అదృష్ట మనే చెప్పాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ పొదుపులు, మదుపులు వృద్ధి చెందుతాయి. అద నపు ఆదాయ మార్గాలు విజయవంతమై ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలున్నాయి. వడ్డీ వ్యాపారాలు, షేర్లు, ఆర్థిక లావాదేవీలు, ఇళ్లు, భూములపై పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ ధన ధాన్య సమృద్ధి యోగం చోటు చేసుకోవడం నిజంగా అదృష్ట మనే చెప్పాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ పొదుపులు, మదుపులు వృద్ధి చెందుతాయి. అద నపు ఆదాయ మార్గాలు విజయవంతమై ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలున్నాయి. వడ్డీ వ్యాపారాలు, షేర్లు, ఆర్థిక లావాదేవీలు, ఇళ్లు, భూములపై పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది.