
దీపావళి సమయంలో మకర రాశి వారు ఉదయం లేచి లక్ష్మీదేవిని, వినాయకుడిని కుబేరుడిని పూజించాలి. అంతే కాకుండా ఈరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వలన మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు అనేక లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. కానీ దీపావళి పండుగ తర్వాతే వీరికి కష్టాలు మొదలు అవుతాయి.

నవంబర్ 15 ,17 వ తేదీల సమయంలో కుజ, సూర్య గ్రహాల సంచారం జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా వీరి జాతకం మలుపు తిరుగుతుంది. వీరు ఈ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగ పరంగా ఇలా అన్ని విధాలుగా వీరు చాలా సమస్యలు ఎదుర్కుంటారు.

ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా తడబడుతుంటారు. నవంబర్ 15 నుంచి ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తారు. ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కోల్పోతారు. ఒక వేళ సమయానికి తొందర పడి నిర్ణయం తీసుకోవడం వలన నష్టాలు చవి చూసే ఛాన్స్ ఉంది. అందువలన మకర రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకర రాశి వారు అప్పుల బాధలతో సతమతం అవుతారు. ఆరోగ్యం బాగలేక వీరు ఇతరుల వద్ద అప్పు చేయాల్సి రావడం జరుగుతుంది. ముఖ్యంగా తెలియక చేసే చిన్న చిన్న తప్పులు భారీ నష్టాలను తీసుకొస్తాయి. ఆర్థికంగా కోలుకోకుండా చేస్తాయి కాబట్టి వీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అవసరం.

అదే విధంగా మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా ప్రమాదం బారిన కూడా పడే ఛాన్స్ ఉంది కాబట్టి, దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి. ప్రయాణాల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, ముఖ్యంగా పదునైన వస్తువులతో గాయాలు అయ్యే ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదని పండితులు చెబుతున్నారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి