రవి, కుజుల అనుకూలత.. త్వరలో ఆ రాశుల వారికి బిగ్ బాస్ యోగం!

Edited By:

Updated on: Mar 27, 2026 | 12:55 PM

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రవి, కుజులు అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు తప్పకుండా సర్వాధికారి (బిగ్ బాస్) యోగం పడుతుందని జ్యోతిషశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒక సంస్థకు అధిపతి కావడం గానీ, ప్రధాన నిర్వాహకుడు కావడం గానీ, ఒక సంస్థను స్వయంగా నెలకొల్పడం గానీ జరుగుతుంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశులకు ఏప్రిల్ 14 తర్వాత ఈ యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశులవారు ఈ దిశగా ప్రయత్నాలు సాగించడం, అడుగులు వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 6
మేషం: ఈ రాశిలో రవి ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నందువల్ల ఈ రాశివారు స్వయంగా ఒక సంస్థను నెల కొల్పడానికి ప్రయత్నించడం మంచిది. ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో సర్వాధికారి, కార్య నిర్వా హణాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం, ఒప్పందాలు కుదరడం, తరచూ విదేశాలకు వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గ్రహ రాజు రవి ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సంపన్నులతో, వ్యాపారవేత్తలతో ఒప్పం దాలు కుదురుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి దశమంలో రవి ఉచ్ఛపట్టడం, కుజుడు భాగ్య స్థానంలో సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. డిమాండ్ బాగా పెరుగుతుంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా దేశ విదేశాలు పర్యటించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

4 / 6
సింహం: రాశినాథుడైన రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి భూభ్రమణ యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లే అవకాశం లభస్తుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. స్వయంగా వ్యాపారాన్ని చేపట్టడం గానీ, ఒక సంస్థను నెలకొల్పడం గానీ చేయడం వల్ల బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

5 / 6
తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం, షష్ట స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. ఒక సంస్థను నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.

6 / 6
ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన రవి పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం, చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు దిన దినాభివృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఏదైనా సంస్థను నిర్వహించడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

Follow Us