
చాలా మంది పండుగల సమయంలో రకరకాల స్వీట్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా శ్రీరామ నవమి సమయంలో ఎక్కువ మంది పాయసం చేస్తుంటారు. కానీ రెగ్యులర్ చేసే పాయసం కాకుండా, ఇంటిలోనే చాలా సులభంగా రవ్వ కేసరి చేయవచ్చును. దీనిని ఇలా సింపుల్‌గా చేయడం వలన టేస్ట్ అదిరిపోతుందంట.

రవ్వ కేసరి, సూజీ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : నెయ్యి, చక్కెర, యాలకులు, రవ్వ, వీలైతే కొన్ని పాలు, పచ్చ కర్పూరం.

తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. ఇప్పుడు అందులో రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసి, రెండు కప్పుల రవ్వను పచ్చివాసన పోయి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది.

తర్వాత వేరొక పాత్ర స్టవ్ పై పెట్టి, అందులో 1.5 కప్పుల నీరు, 0.5 పాలు పోసి బాగా మరిగించాలి. ఇవి మరిగే సమయంలో వేయించి పెట్టుకున్న రవ్వను పాల మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు దీనిని సన్నని మంటపై బాగా కలుపుతూ, ఉండలు లేకుండా చూసుకోవాలి.

దీని తర్వాత కప్పు చక్కెర, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, వీలైతే మంచి సువాసన, టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం కొంచెం పచ్చ కర్పూరం వేయాలి. అంతే కాకుండా వాన్ టీ స్పూన్ నెయ్యి వేయాలి. దీనిని ఐదు నిమిషాల పాడు బాగా ఉకనివ్వాలి. అంతే భద్రాచలం శ్రీరాముల వారి ఆలయంలోని ప్రసాదం టైప్‌లో రవ్వ కేసరి రెడీ. మరి మీరు కూడా ఇంటిలో ప్రిపేర్ చేయండి.