
మిథునం: ఈ రాశికి ఆశ్వయుజ మాసమంతా శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూడు పువ్కులు ఆరు కాయలుగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి, సుఖ శాంతులు ఏర్పడడానికి అవకాశం ఉంది. నిరు ద్యోగులకు తప్పకండా ఆశించిన ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనేక మార్గాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశిలో గురువు సంచారం, చతుర్థ స్థానంలో శుక్ర, బుధుల సంచారం శుభ యోగాలను, రాజ యోగాలను కలిగిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు, అదనపు రాబడి ద్వారా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే సూచనలున్నాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధా న్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడతాయి.

కన్య: ఈ రాశికి ఆశ్వయుజ మాసమంతా గురు, కుజులు లాభ స్థానంలోనూ, శుక్ర, బుధులు ధన స్థానంలోనూ ఉండడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరు గుతాయి. బంధువుల రాకపోకలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది.

తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు, రవి, బుధులు, దశమ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సిద్ధిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు జోరందుకుంటాయి. ఆశించిన పెళ్లి సంబం ధం కుదురుతుంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ, భాగ్య స్థానాల్లో శుభ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల ఆశ్వయుజ మాసంలో చాలావరకు మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధించడం జరుగుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరం: ఈ రాశికి ఆశ్వయుజ మాసమంతా సప్తమ, దశమ స్థానాలు శుభ గ్రహాలతో బాగా బలంగా ఉండడం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడంతో పాటు లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.