ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!

Updated on: Jun 22, 2026 | 6:29 PM

జ్యోతిష్యశాస్త్రంలో నక్షత్రాలు, రాశులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే నక్షత్రాల ఆధారంగా పంచాంగం రూపొందించారంట. అలాగే రైతులు కూడా నక్షత్రాల ఆధారంగా వ్యవసాయ పంచాంగం మార్చుకున్నారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే, దానిని ఆ కార్తెగా పిలుస్తారు. ఇక అన్ని కార్తెల్లో ఆరుద్ర కార్తె రైతులకు చాలా స్పెషల్ కార్తె అంటారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
జూన్ 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం అయ్యింది. ఇది వ్యవసాయ పనులకు చాలా అనుకూలమైనది. అందుకే ఈ కార్తె రైతులకు చాలా ఇష్టమైన కార్తె అంటారు. ముఖ్యంగా మృగశిర కార్తెతో వర్షాలు ప్రారంభం అయ్యి నేలను మొత్తం తడిపేస్తుంది. ఇక ఆరుద్రలో జోరు వానలు పడుతాయి. ఈ సమయంలో రైతులు అందరూ చాలా ఆనందంగా వ్యవసాయం పనులు చేపడుతారు.

2 / 5
ఆరుద్ర కార్తెలో  ఒక్క వాన పడగానే, ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి. దీంతో రైతులు పురుగులను చూసి సంబరపడి పొలం పనులు, వరి నాట్లు వేయడం వంటి పనులు చేస్తారు. సాగు పనులు ఊపు అందుకుంటాయి. అంతే కాకుండా ఈ సమయంలో పంటలు వేయడం వలన మంచి దిగుబడి వస్తుందని చెబుతుంటారు రైతన్నలు.

3 / 5
ఇక  ఆరుద్ర కార్తె చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ సమయంలో వర్షాలు పడటం, పొలం పనులు మొదలు పెట్టడం చేస్తుంటారు. అందుకే చాలా మందికి ఈ కార్తె అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే? ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అనే సామెత ఉంది. అందుకే రైతన్నలు ఆరుద్రలో పడే వానలను అమృతంతో పోలుస్తారంట.

4 / 5
ముఖ్యంగా ఆరుద్ర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆరుద్ర పురుగులు. ఇవి ఎరుపు రంగులో ఉండి, వెల్వెట్ క్లాత్ చుట్టుకున్నట్లు ఉంటాయి. ఈ పురుగులు ఆరుద్ర కార్తెలో వర్షం పడిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పురుగులు ఎవరి పొలంలోనైతే ఎక్కువగా కనిపిస్తాయో వారికి పంట బాగా పండుతుంది, మంచి దిగుబడి వస్తుందని చెబుతారంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us