
మేషం: ఈ రాశిలో రవి ఉచ్ఛ స్థితి కలగడం, శుక్రుడితో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

మిథునం: నాలుగు గ్రహాల రాశి మార్పుతో ఈ రాశికి దశమ, లాభ స్థానాలు పటిష్ఠం అవుతున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం: బుధ, శుక్ర, కుజ, రవుల మార్పుతో ఈ రాశికి నవమ, దశమ స్థానాలు బలోపేతం అవుతున్నందువల్ల, ఈ రాశివారికి ఈ నెలలో ఆశించిన విదేశీ ఉద్యోగ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సాహచర్యం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది.

సింహం: రాశ్యధిపతి రవి భాగ్యస్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి ఆశించిన స్థిరత్వం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

ధనుస్సు: ఈ రాశికి నాలుగు గ్రహాల మార్పుతో చతుర్థ, పంచమ స్థానాలు బాగా పటిష్ఠం అవుతున్నందు వల్ల కుటుంబంలో నెల రోజులపాటు పండుగ వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ, సొంత ఇంటి ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. సంతాన యోగం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కుంభం: ఈ రాశికి గ్రహాల మార్పుతో ధన, తృతీయ స్థానాలు పటిష్ఠం అవుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యాపా రాలు అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది.