
బంగారం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిపోతుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు గోల్డ్ రేట్స్, విపరీతంగా దాదాపు 80 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. యుద్ధ ప్రారంభ సమయంలో విపరీతంగా పెరిగిన ధరలు, ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అధిక జ్యేష్ఠ్య మాసం కూడా పూర్తై శుభకార్యలకు మంచి రోజులు వచ్చేశాయి, దీంతో బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతూ వస్తున్నాయి. అయితే అతి త్వరలో ఆషాఢం ప్రారంభం కానుంది. దీంతో ఈ సమయంలో బంగారం ధరలు తగ్గుతాయని కొందరు ఆశగా ఎదురు చూస్తే మరికొంత మంది మాత్రం ధరలు పెరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. కాగా, అసలు ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూసేద్దాం.

జూలై రెండో వారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఇక ఈ సమయంలో చాలా వరకు ఎలాంటి శుభకార్యాలు జరపరు. అంతే కాకుండా బంగారం కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపరు. దీంతో చాలా మంది ఈ సమయంలో బంగారం ధరలు విపరీతంగా తగ్గుతాయని భావిస్తుంటారు.

అంతే కాకుండా ప్రస్తుతం యుద్ధం కూడా ముగిసిపోయింది. యుద్ధ ప్రభావం, ఆషాఢ మాసం కావడంతో ఈ రెండింటి ప్రభావం వలన బంగారం దిగొస్తుంది అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే చాలా వరకు బంగారం ధరలు అనేవి అంతర్జాతీయ అంశాలపై మాత్రమే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆషాఢ మాసంలో బంగారం తగ్గుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం అంటున్నారు నిపుణులు.

చాలా వరకు గోల్డ్ రేట్స్ అనేవి, అమెరికా ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు అనేవాటిపై ఆధారపడి ఉంటాయి. ఒక వేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే బంగారం ధర భారీగా తగ్గుతుంది. లేదు వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ కూడా అంతగా లేకపోవడం వలన అమెరికా వడ్డీ రేట్లను గనుక పెంచినట్లు అయితే తప్పకుండా ఆషాఢంలో బంగారం ధరలు పడిపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు.

కానీ చాలా మంది ఆషాఢ మాసం వచ్చేస్తుంది బంగారం తగ్గుతుంది అనుకుంటారు. బంగారం అనేది ఇక్కడి మాసాలు, పండుగలు కాకుండా అంతర్జాతీ ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని గమనించి, ఎప్పుడు గోల్డ్ స్వల్పంగా తగ్గినా అప్పుడు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు